Home / SLIDER / సింగరేణి ఎన్నికల్లో అన్నీ తానై… ఎంపీ కవిత

సింగరేణి ఎన్నికల్లో అన్నీ తానై… ఎంపీ కవిత

తెలంగాణ రాష్టంలో వచ్చే నెల 5న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ధూసుకేళ్ళుతుంది . ప్రధాన పోటీ సంఘాల ఎత్తులను చిత్తు చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. సింగరేణిలో గులాబీ జెండా ఎగరేసేలా ముందుచూపుతో తో ముందుకెళుతోంది. ముఖ్యంగా ఎంపీ కవిత ఒక సైన్యంగా టీబీజీకేఎస్ గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు.

సింగరేణి ఎన్నికల ప్రచారాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారంలో బిజీ అయ్యారు. ఇక టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు ఎంపీ కవిత అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. విపక్ష కార్మిక సంఘాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కార్మికులను తమ వైపు తిప్పుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ నేతలంతా కోల్ బెల్ట్ ఏరియాలో దింపేశారు. కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కార్మకులకు ఇవ్వాల్సిన హామీ పైన టీబీజీకేఎస్ నేతలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఎంపీ కవిత ముందుకు సాగుతున్నారు .

ఒకవైపు ఎన్నికల ప్రచారాన్ని టీబీజీకేఎస్ హోరెత్తిస్తూనే…మరోవైపు ఇతర సంఘాలను నేతలను తమవైపు తిప్పుకునేలా స్కెచ్ వేసింది. ఇతర సంఘాల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపై గులాబీ నేతలు దృష్టిసారించారు. వారిని తమ సంఘంలోకి చేర్పించే బాద్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. దీంతో ఇప్పటికే ఎఐటియూసి, ఐఎన్ టియూసి, హెచ్ ఎంఎస్, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి కార్మికులు, కొందరు నేతలు టిజిబికెఎస్ లో చేరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat