Home / ANDHRAPRADESH / 8ఏళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రాన్ని “బయటకు తీసిన జగన్ ..

8ఏళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రాన్ని “బయటకు తీసిన జగన్ ..

ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి మీద అధికార పార్టీ తరపున పోటి చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే .అంతే కాకుండా మరోవైపు నెల రోజుల వ్యవధిలో జరిగిన తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ మహానగర కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది .దీంతో పార్టీ నేతలతో పాటుగా క్యాడర్ కూడా తీవ్ర నిరాశలో ఉంది .ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్లాన్ ను తెరపైకి తీసుకొచ్చారు .

ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఆస్థాన మీడియా ద్వారా అదిగో పులి ..ఇదిగో పులి అన్న తరహాలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,నేతలు తమ పార్టీలోకి వస్తోన్నారు అంటూ రోజు ఒక మసాలాలను దట్టించి వార్తలను ప్రచురిస్తూ వైసీపీ క్యాడర్ లో భయాలను సృష్టించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తోంది .ఈ భయాలను పటాపంచలు చేయడానికి ..బాబు అండ్ బ్యాచ్ కు పట్టపగలే చుక్కలు చూపించడానికి దాదాపు ఎనిమిది యేండ్ల తర్వాత జగన్ సరికొత్త ప్లాన్ కు స్వీకారం చుట్టారు .ఈ క్రమంలోనే వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం పేరిట ఇప్పటికే నలబై మూడు లక్షల మందిని తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి వేసిన ప్లాన్ విజయవంతమైంది .ఇంకా ఈ కార్యక్రమాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ శ్రేణులు అంటున్నారు .

ఇలాంటి తరుణంలో త్వరలోనే బూత్ లెవల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న పార్టీ క్యాడర్ తో పాటుగా ఇతర పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తల అసంతృప్తులతో సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించాలని వైసీపీ పార్టీ కింది స్థాయి క్యాడర్ కు ఇప్పటికే సూచనలు ..సలహాలు వెళ్ళాయి అంట .దీని తర్వాత ఇప్పటికే వైసీపీ తరపున గెలిచి మంత్రులుగా అధికారాన్ని చెలాయిస్తున్న వారిపై ..అధికారాన్ని అనుభవిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటానికి చేస్తోన్న దూకుడును ఇంకా పెంచాలని జగన్ ఆలోచనలో ఉన్నారు అంట .

అందుకే త్వరలోనే జాతీయ స్థాయిలో పర్యటించి అన్ని పార్టీలను ఏకం చేసి బాబు అవినీతి అక్రమాలపై పోరాటాలు కొనసాగిస్తోన్న రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ఉన్న బాబు తీరును ఎండగట్టి ప్రజల్లో మంచి ఆదరణను పొందాలని జగన్ సూపర్ ప్లాన్ వేశారు అంట .ఇప్పటికే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన జగన్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లోపు పార్టీని శక్తివంతంగా చేయాలనీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశాడు జగన్ .ఇది విజయవంతం అయితే బాబు అండ్ బ్యాచ్ కు చుక్కలు కనిపించడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat