ఆరో రోజు కూడా నష్టాల్లో మార్కెట్లు .. – Dharuvu
Home / BUSINESS / ఆరో రోజు కూడా నష్టాల్లో మార్కెట్లు ..

ఆరో రోజు కూడా నష్టాల్లో మార్కెట్లు ..

ఈ రోజు కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఆరో రోజూ నష్టాలను చవిచూశాయి. నేటి సాయంత్రం వరకు ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 27 పాయింట్లు కోల్పోవడం ద్వారా నెల రోజుల కనిష్ఠానికి పడిపోయి 31,599.76 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.10 పాయింట్ల నష్టంతో 9,871.50 వద్ద స్థిర పడింది.ఉత్తరకొరియా ప్రభావం ఈ రోజు మార్కెట్‌పై కొనసాగింది. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 59 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో స్తబ్దుగా ప్రారంభమైంది. ఆ తర్వాత మరింత దిగజారిన సూచీలు చివరి వరకూ నష్టాల్లోనే నడిచాయి.