Home / EDITORIAL / TBGKS అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే TBGKS

TBGKS అంటే కేసీఆర్…కేసీఆర్ అంటే TBGKS

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో గత 58 ఏళ్లలో కార్మికుల హక్కులకు సమాధి కట్టిన యూనియన్లే మళ్లీ కొత్తగా నీతులు వల్లిస్తున్నయి . హంతకులే సంతాప సభలు పెట్టినట్లుగా కార్మికుల వారసత్వ ఉద్యోగాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిగా సమాధి కట్టిన నీచ నికృష్ట సంఘాలే ఇప్పుడు అమాయకులైన సింగరేణి కార్మికుల ఎదుట కన్నీళ్లు కారుస్తున్నాయి . దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా  … కత్తులు దూసిన వాళ్లే శాంతి మంత్రం జపించినట్లుగా … కార్మికుల హక్కులను కాలరాచే ఒప్పందాల మీద సిగ్గు లేకుండా సంతకాలు పెట్టిన వాళ్లే ఇప్పుడు మళ్లీ మాకు ఓటు వేయండంటూ కార్మికుల ముందుకు వస్తున్నారు . సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద వారసత్వ ఉద్యోగాలను రద్దు చేయాలని ది 06.06.1998 నాడు ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న అత్యంత దుర్మార్గమైన అయిదు సంఘాలు ఉన్నయి . ఆ దుర్మార్గ , దుష్ట సంఘాల్లో AITUC ( సీపీఐ అనుబంధం ) , INTUC ( కాంగ్రెస్ అనుబంధం ) CITU ( సీపీఎం అనుబంధం ), BMS ( బీజేపీ అనుబంధం ), HMS (ప్రస్తుత ఇండిపెండెంట్ సంఘం , ఒకప్పటి జనతాదళ్ అనుబంధం ) ఉన్నయి .

వారసత్వ ఉద్యోగాలు వద్దంటూ చేసిన ఒప్పందంలో కార్మికుల పీకలు కోస్తూ సంతకాలు పెట్టిన మహానుభావుల్లో ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు అడగడానికి వస్తున్న ఆయా సంఘాల నాయకులు ఉన్నరు . వారిలో వి. సీతారామయ్య , వై . గట్టయ్య ( AITUC ) ,జనక్ ప్రసాద్ ( INTUC ) ,పి. రాజారావు ( CITU ), ఎల్ . జగన్మోహన్, పులి రాజిరెడ్డి ( BMS ) , రియాజ్ అహ్మద్ ( HMS ) ఉన్నరు . అప్పుడు వారసత్వ ఉద్యోగాలు వద్దని చంద్రబాబు ప్రభుత్వం లో సంతకాలు పెట్టిన ఈ నీచ, నికృష్ట, దుర్మార్గ సంఘాల నాయకులే మళ్ళీ దొంగ కూటమి కట్టి AITUC తరపున ఓటు అడగడానికి సిగ్గు లేకుండా ముందుకొస్తున్నరు . ఇలాంటి దుర్మార్గపు సంఘాలను నమ్మితే మళ్ళీ గొంతు కోస్తరనే విషయాన్ని కార్మికులు గుర్తు పెట్టుకోవాలి .

ఇక తెలంగాణ కార్మికుల శ్రేయస్సే శ్వాసగా ఉద్భవించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( TBGKS ) తెలంగాణ రథసారథి , ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి అంకురించింది . ఇప్పటి వరకు కార్మికులకు మేలు చేసే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు TBGKS ఊపిరి పోసింది . ఉద్యోగులకు బోనస్, లాభాల్లో వాటా , వైద్య సదుపాయాలు వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది . ఒక కార్మికుడు మెడికల్ అన్ ఫిట్ అయి ఉద్యోగం వద్దు అనుకుంటే దేశంలోనే మూడు లక్షల మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కోల్ ఇండియా సంస్థ కేవలం రూ.5 లక్షలు ఇస్తుంటే తెలంగాణ సింగరేణి లో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో ఎంపీ కవిత నాయకత్వంలో TBGKS రూ. 12.50 లక్షలు ఇప్పిస్తున్నది . సింగరేణి కార్మికులందరికీ డ్రెస్ కోడ్ క్రింద ఉచితంగా యూనిపామ్స్ ఇప్పిస్తున్నది .

ఇంకా TBGKS కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు …

1).కార్మికుని కూతురు రెండవ బిడ్డకు కూడా కంపెనీ వైద్య శాలలో కాన్పు చేయడానికి యాజమాన్యంను ఒప్పించినారు.
2).ప్రతిపక్ష సంఘాల వారు ఎప్పుడో పోడగొట్టినPME మస్టర్ ఇప్పించడం జరిగినది.
3).అండర్ గ్రౌండ్‌లో పనిచేస్తూన్న కార్మికులకు డ్యూటీ డ్రస్ ఇప్పించడంతో పాటు డ్రెస్ కుటించుకోవాడనికి ఖర్చు మరియు ప్రతి నెలకు వాషింగ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
4).సింగరేణి లాబాలలో వాటా గతగుర్తింపు సంఘం వారు ఉన్నప్పుడు16.5%నుండి1%కూడా4సం।।లలో పెంచలేక పోయింది. ఇదిTGBKS హయములో23% వరకు చేరుకుంది.
5).దసరా అడ్వాన్స్‌ను TBGKS 18000/- చేయడం జరిగింది.
6).భూపాలపల్లి, సత్తుపల్లి కార్మికులకుHRA 2% నుండి10% కి పెంచడం జరిగినది.8% besic పెరగడం అంటే పెరుగుదల ఎంతో ఆలోచించడి.
7). Fitter’s electricions overman sardhars కు చార్జ్ ఎలవెన్స్ 50% పెంచడం జరిగినది.
8).స్వంత ఇంట్లో ఉండే కార్మికులకు కరెంటు బిల్లు 72/- రూపాయలను .132/- కు పెంచడం జరిగింది
9).మెడికల్ అనిఫిట్‌ అయిన కార్మికులకు డిపెండెంట్ లేకపోతే 3,50,000/-నుండి12,50,000/-కు పరిహారం ఇవ్వడం జరిగినది.

10).MMCని 6,500/-నుండి15,000/-కు పెంచడం జరిగినది
11).దిగిపోయిన కార్మికులకు చివరి పని దినన సన్మాన ఖర్చు900/- నుండి3,500/-చేయడం జరిగింది.
12).డ్యూటీలో ఉండి సాహజ మరణం చెందిన కార్మిక కుటుంబాలకు5,00000/-లు కాక అదనంగా10,00000/- డ్యూటీలో ఉండి ప్రమాదవశాత్తు మారణించిన కార్మికులకు5,000000/-లె కాక 20,00000/-లు ఇప్పించడం జరుగుతుంది. అందులో సగం కార్మికుల బాగాస్వామ్యము గాను మిగతా సగం యాజమాన్యం నుండి ఇప్పించడం జరుగుతుంది. ఈ పదకం పై యాజమాన్యం5,00000/- 10,00000/- నికరంగా ఇస్తూన్నట్లే కదా!
ఇంతమంచి పదకాన్ని  అడ్డు కున్న చరిత్ర మిగతా సంఘూల వారిది. వీరి వ్యతిరేకత వల్లనెే ఇది శాశ్వత ఒప్పందంగా కాకTBGKS గుర్తింపు సంఘంగా ఉన్నంత వరకే. కార్మికుల దురదృష్టవశాత్తు TBGKS ఓడిపోతే ఈ పతకం రద్దు చేస్తారు. TBGKS కు ఇంతకుముందే మిగిలిన సంఘాల వారు సహకారించీ ఉన్నట్లయితే చాలా కార్మికు కుటుంబాలు బాగుపడి ఉండేవి.
ఇంతకి ఈ సంవత్సర కాలంలో ప్రతి కార్మికుని వద్దDRF వసుల్లు (380/-) మాత్రమే.
13).గత సంఘాల వారి కాలంలో స్పోర్ట్స్ అడిన వారికి స్పోర్ట్స్ రలిఫ్ గా పరిగణించేవారు. ఇప్పుడు OD మస్టర్ గా పరిగణిస్తూ ఉండడం వల్ల స్పోర్ట్స్ లో పాల్గొనే కార్మికులకు కూడా190 మస్టర్లు చేసుకునే అవకాశం కలిగినది190 మస్టర్లతో వచ్చే సౌకర్యాలు పొందుతున్నారు.

14).గతంలో సింగరేణి వైద్య శాల అంటే కార్మికులకు అన్ ఫిట్ చేసి ఉద్యోగం పికీవేసేది అనే భావన ఉండేది. దానికి మన ఘనత వహించిన ప్రతి పక్ష యూనియన్లే సాక్షులు. ఇప్పు వైద్యం మెరుగు పడింది. పెద్ద జబ్బులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు పంపిస్తుంది.
15).ప్రధాన హాస్పటల్ లో A/C లుC.T scan ఏర్పాటు చేయడం జరిగింది.
16).క్యాంటిన్ సౌకర్యాలు పెంచడానికి ప్రయత్నించింది.మెాడల్ క్యాంటిన్లను ప్రారంభించడం జరిగినది.
17).TBGKS హయాంలోనే RO plants క్యాంటిన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగినది.
18).సత్తుపల్లి డోర్లి OC లలో ప్రవేట్ కంపెనీల లాంటి సమయపాలన ఉండేది. దీని వల్ల కార్మికులు ఇబ్బంది పడేవారు.ఈ సమయాన్ని మర్పించిన ఘనతTBGKS ది.
19).కంపెనీ అంతర్గత పరిక్షల ద్వారా ప్రమెాషన్ పొందిన కార్మికులుకు ఎక్కడ పని చేసి ఉంటే అక్కడే posting ఇచ్చారు.ఇంతకు ముందు ప్రమెుషన్ పొందిన వారు వేరే ఏరియా లో పని చేయాల్సి వచ్చేది.అందువల్ల కార్మికులు ప్రమెుషనును తిరస్కరించేవారు.
20).సింగరేణి లో deplama holders నియామకాలు చేపట్టినపుడు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా స్థానికులకు కాకుండా బయటి వళ్ళకు
కూడా పరిక్షలకు అనుమతి నీయడం వల్ల స్థానికులకు అన్యాయం జరిగేది. ఆ అన్యాయాన్ని పెద్ద పేరు ఉన్న సంఘాలు ఏవి వ్యతిరేకించలేదు కని TBGKS గుర్తింపు సంఘముగా లేక ముందే పోరాడి ఈ హక్కును సాదించడం జరిగింది అని గమనించ వలసిందిగా కోరుతున్నాను.
21).మెడికల్ బోర్డు అయిన డిపెండింట్స్ కు ఇంతకు ముందు నెలకు 25 మందికి మాత్రమే ఉద్యోగ నియమాకలు జరిగేవి.TBGKS వచ్చిన తరువాత ఆ పరిమితులను తొలగించి డిపెండింట్స్ అందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది.
22).450కంటె పైనdismis అయిన కార్మికులు ఉంటే 75 మందికి మాత్రమే ఉద్యగాలు తిరిగి ఇప్పించడం జరిగింది. ఇది గతంలో TBGKS వచ్చిన తరువాత దాదాపు అందరికి ఉద్యగాలు ఇప్పించారు.

23).1st క్యాటగఏవిలో ఉద్యగం పొందిన టేక్నిషన్స్ కు 2వ క్యాటగిరి ఇవ్వకుండా4th క్యాటగిరి ఇవ్వడం జరిగింది.
24).1వ క్యాటగిరి కూడా సర్వీసులో కల్పడం జరిగింది.
25).ఫిట్టర్స్ 10 సం॥ తరువాత chargand ప్రమెుష‌న్ ఇవ్వడం జరిగింది. గతంలో జరిగిన యూనియన్ ఒప్పందంలో భాగంగా టప్ ర్యాంకర్స్ కు కూడాchargand ప్రమెుషన్ రాలేదు.
26).TBGKS హైయంలో జరిగిన అన్ని బదిలీలు కూడ కార్మికుల అర్హత ను బట్టి పారదర్శకంగా నిర్వహించడం జరిగింది.
27).సెటిలింగ్ అలవెన్స్ దిగిపోయిన కార్మికుల స్వంత ఊరికి వెళ్లడానికి ఇచ్చే అలావెన్స్10 వేల నుండి20 వేలకు పెరిగింది.
28).ప్రధాన మైన డిపెండింట్ ఎంప్లాయ్ మెంట్ ప్రకటించడం,హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఎన్నికల తరువాత ఈ విషయం మల్లి మన ముందుకు వస్తుంది. డిపెండింట్ హక్కుపై TBGKS గెలిస్తేనే మల్లి చర్చ  జరుగుతుంది. యాజమాన్యం మల్లి డిపెండింట్ హక్కు ఇవ్వచ్చు.కానీ వేరే యూనియన్లు గెలిసై ఈ హక్కుపై చర్చముగిసినట్లే.  డిపెండెంట్ ఎంప్లాయ్ మెంట్ శాశ్వతంగా మూసుకుపోయె అవకాశం ఉంది అని కార్మికులు గ్రహించగలరు. కార్మికుల కోరికలుTBGKS తీర్చడం జరిగింది. ఇంతకు ముందు పని చేసిన INTUC,AITUC వారి 4 సం॥కాలంలో ఇన్ని కోర్కెలు నెరవేర్చరా.ఒక్క సారి ఆలోచించ గలరు.
ఈ ఎన్నికలు కూడా ఉప ఎన్నికల వంటివే. ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరైనా అధికార పార్టీ వారినే గెలిపిస్తరు.ఎందుకంటే వారు అరా తీసి కార్మికుల ఆశలను నెరవేర్చగలరు. ఇది మనము ప్రస్తుతం గమనిస్తున్న విషయము వీటితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఆలోచనలు చేస్తున్నరు . పై విషయములు అన్నీ గమనించి విజ్ఞతతో సరైన యూనియన్ను గెలిపించుకోన వలసిన బాధ్యత  కార్మిక సోదరులపై ఉంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat