ఆరురోజులు బ్యాంకులకు సెలవు… – Dharuvu
Home / BUSINESS / ఆరురోజులు బ్యాంకులకు సెలవు…

ఆరురోజులు బ్యాంకులకు సెలవు…

దసరా పండుగ అనంతరం ఆదివారం…ఆ తర్వాత గాంధీ జయంతి సెలవులు వరుసగా రావడంతో బ్యాంకులకు ఆరురోజులపాటు సెలవు ప్రకటించారు. దీంతో దుర్గాపూజ వేళ దేశంలో నగదు కొరత ఏర్పడనుంది. బ్యాంకులకు సెలవులతో ఏటీఎంలు కూడా ఖాళీ కానున్నాయి. పండుగతోపాటు నెలాఖరు కావడంతో శుక్రవారం నుంచి సోమవారం వరకు ఖాతాదారులు ఏటీఎంలలో పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా చేయనున్నారు.

మళ్లీ అక్టోబరు 6, 12 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో మొత్తం మీద వారంరోజులపాటు ఏటీఎంలలో నగదు లేక వెలవెల పోనున్నాయి. పండుగల వేళ బ్యాంకు సెలవుల వల్ల ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల అధికారులు ప్రకటించారు.