Home / SPORTS / ఇండియ‌న్ క్రికెట్ తూఫాన్‌.. పాండ్యా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కపిల్ దేవ్‌..!

ఇండియ‌న్ క్రికెట్ తూఫాన్‌.. పాండ్యా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ కపిల్ దేవ్‌..!

ఇండియాలో క్రికెట్ పుట్టిన‌ప్ప‌టి నుండి గ‌మ‌నిస్తే.. అస‌లు భార‌తీయ క్రికెట్‌ చరిత్రలోనే ఇప్పటి దాకా బెస్ట్ ఆల్‌రౌండర్ ఎవరనే ప్రశ్న వస్తే.. క్రికెట్ విశ్లేషకులు ఓ క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కపిల్ దేవ్. అద్భుతమైన పేసర్‌గా.. బ్యాట్స్‌మ్యాన్‌ గా కపిల్ దేవ్ టీం ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 1983లో టీం ఇండియా తొలి వరల్డ్‌కప్‌ గెలుచుకుంది కూడా ఆయన సారధ్యంలోనే. ఆయన రిటైర్ అయిన తర్వాత టీం ఇండియాకు ఎంతో మంది ఆల్‌ రౌండర్లు దొరికినా, కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ దొరకలేదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.

అయితే ఇటీవల కాలంలో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ హార్దిక్‌ పాండ్యా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో, ఎన్నో ఏళ్లకు హార్దిక్ పాండ్యా రూపంలో టీం ఇండియాకు కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్‌ దొరికాడని చాలా మంది అతడిని ప్రశంసలతో ముంచెతుతున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ కామెంట్లపై కపిల్ దేవ్‌ స్పందించాడు. పాండ్యా తన కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రతిభావంతమైన క్రికెటర్ అని అతడు చెప్పాడు. తనకు ఉన్న ప్రతిభా సామర్థ్యాలతో టీమిండియాకు వెన్నుముక్కగా నిలబడగల ప్రతిభా సామర్థ్యాలు అతడి సొంతమని ఆయన తెలిపాడు.అయితే, దీనికి చేయాల్సిందల్లా పాండ్యా కష్టపడటమేనని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు తన హార్ట్ వర్క్ తో పాండ్యా తన ఆటతీరును మెరుగుపరుచుకోగలిగితే.. అతడు ఎన్నో ఘనతలు అందుకోగలడని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat