దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…! – Dharuvu
Breaking News
Home / BAKTHI / దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…!

దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…!

దసరా రోజు భక్తి  శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు దసరా రోజు భక్తి  శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు కలుగజేయాలని , సకల విజయాలు సిద్ధింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సాయంత్రంచీకటి పడే వేళ..అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటాం.  గుడి దగ్గరకు వెళ్లి జమ్మి ఆకు బంగారం  తెచ్చుకుంటాం. దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు , పిండివంటలు, జమ్మి ఆకు ఎలాగుర్తుకు వస్తుందో పాలపిట్ట అలాగే గుర్తుకువస్తుంది..  పాలపిట్ల దర్శనంతోనే దసరా సంబురాలు  పరిపూర్ణం అవుతాయి..ముఖ్యంగా తెలంగాణలో దసరా రోజు పాలపిట్లను చూడటానికిచిన్నా పెద్దా, పిల్లాజెల్లాతో సహా ఊరు ఊరంతా కదులుతుంది. ఇలా దసరా రోజు పాలపిట్ల చూడటం  వెనుక అంతరార్థం ఉంది. పాలపిట్ల శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టనుచూడగలగడాన్ని ఎంతో అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. గుప్పెండత ఉంటే ఈ పాలపిట్ట  చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పండుగ వచ్చిదంటే పాలపిట్టను చూడాల్సిందే.  దానికి  మొక్కాల్సిందే. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని నవ  అనుగ్రహాలు కలుగుతాయని, దోషాలు తొలిగిపోయి, చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని పలువురి నమ్మకం.

ఇంతకూపాలపిట్టను దసరా నాడే ఎందుకు చూడాలి అంటారా..దాని వెనుక పెద్ద కథే ఉంది.పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా  ఈ పాలపిట్ట కనిపించిందంట..అప్పటినుంచి వారికి విజయాలు సిద్ధించాయని జనపదుల నమ్మకం. అందుకే  విజయదశమి రోజున పూర్వం మగవాళ్లు తప్సనిసరిగా అడవికి పోయి పాలపిట్టను చూసిగానిఇంటికి వచ్చేవారు కాదంట..ప్రజల మనసుల్లో ఈ పాలపిట్టకు సాంస్కృతికంగా , పురాణాలపరంగాఇంత ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతోపాటు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర  పక్షిగా ఇది వెలిగిపోతుంది. ఇప్పుడు ఈ పక్షి జాడ అపురూపమైపోయింది. పల్లెల్లో ఇవి అప్పుడప్పుడు
మెరుపు మెరిసినట్లుగా కనిపిస్తున్నా..సిటీల్లో మాత్రం కనిపించకుండాపోయాయి. అందుకే దసరా  పండుగనాడు కొందరు ఈ పాలపిట్టలను పట్టుకుని పంజరంలో ఉంచి చూపిస్తూ డబ్బులు వసూలు  చేస్తుంటారు. మరి కొందరు దసరా నాడు పాలపిట్టలను కొని ఊరి చివర పొలాల మధ‌్య విడిచి  పెడుతుంటారు. ఏదేమైనా దసరా పండుగ వచ్చిందంటే  ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కే పక్షిఈ పాలపిట్ట. తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టనురాష్ట్ర పక్షిగా ప్రకటించింది. మరి ఇంతటి ప్రాశస్త్యం కల పాలపిట్టలను సంరక్షించుకోవాల్సిన బాధ్యతప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిమీద ఉంది.. దసరా నాడు పాలపిట్టను చూడండి..సకల శుభాలు  పొందండి.