ఎస్‌బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్‌..! – Dharuvu
Home / BUSINESS / ఎస్‌బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్‌..!

ఎస్‌బీఐ చైర్మన్ గా రజనీష్ కుమార్‌..!

భారత దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్‌బీఐకి కొత్త బాస్ వచ్చారు. రజనీష్ కుమార్‌ను కొత్త చైర్మన్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టనున్న రజనీష్.. మూడేళ్లపాటు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ ఆమోదించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆర్డర్‌లో తెలిపింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లలో రజనీష్ కుమార్ ఒకరు. 1980లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన రజనీష్.. వివిధ డిపార్ట్‌మెంట్లలో పనిచేశారు. ఎస్‌బీఐలోని రీటెయిల్ బిజినెస్‌ను ప్రస్తుతం రజనీష్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం చైర్‌పర్సన్‌గా ఉన్న అరుంధతి భట్టాచార్య అక్టోబర్ 6న రిటైర్ కానున్నారు. 2013లో భట్టాచార్య ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే గతేడాదే ఆమె పదవీకాలం ముగిసినా.. కేంద్రం ఏడాది పాటు పొడిగించింది. ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన తొలి మహిళ అరుంధతియే. 1977లో ఆమె ఎస్‌బీఐలో చేరారు. ఇప్పటివరకు ఎస్‌బీఐలోని అభ్యర్థులనే చైర్మన్లుగా నియమించిన ప్రభుత్వం.. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది.