ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి – Dharuvu
Home / INTERNATIONAL / ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి

ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువ అది. ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దాన్ని ముక్కలుగా వండుకుని తినేశారు. ఈ ఘటన ఇండోనేసియాలో జరిగింది.
వివరాల్లోకెళితే.. నబబన్‌ అనే వ్యక్తికి శనివారం పామాయిల్‌ తోటలో ఈకొండచిలువ కంటపడింది. దాన్ని చంపడానికి యత్నించే క్రమంలో పాముఅతడిపై దాడి చేసింది. దాంతో అతడి కుడి చెయ్యి తెగిపోయింది. అయినా పట్టు వదలకుండా గ్రామస్థుల సాయంతో దాన్ని కొట్టి చంపేశారు.

అంతటితో ఆగకుండా దాని కళేబరాన్ని ఒకరోజంతా పామాయిల్‌ చెట్లకు కట్టేశారు. ఆ తర్వాత ముక్కలుగా నరికి వండుకుని తినేశారు. కొండచిలువ కళేబరం పక్కన పిల్లలు నిలబడి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
ఈ ప్రాంతంలో భయంకరమైన కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తుంటాయని స్థానికులు తెలిపారు. కొద్ది నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి పొలంలో పనిచేసుకుంటుండగా అతనిపై కొండచిలువ దాడి చేసి అతన్ని సజీవంగా మింగేసింది.