హువావే నుండి మరో న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్ .. – Dharuvu
Home / TECHNOLOGY / హువావే నుండి మరో న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్ ..

హువావే నుండి మరో న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్ ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఐను విడుదల చేసింది. రూ.17,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి లభ్యం కానుంది.హువావే హానర్ 9ఐ ఫీచర్లు  ఇలా ఉన్నాయి .5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కల్గి ఉంటుంది .

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కల్గి ఉంటుంది ..