హైదరాబాదీ మటన్‌ మసాలా తయారుచేసే విధానం ..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / హైదరాబాదీ మటన్‌ మసాలా తయారుచేసే విధానం ..?

హైదరాబాదీ మటన్‌ మసాలా తయారుచేసే విధానం ..?

హైదరాబాద్ లో బిర్యానికి ఎంత పేరుందో అందరికి విదితమే .ఈ క్రమంలో హైదరాబాదీ మటన్ మసాలాకి ఇంకా డిమాండ్ ఉంది .అసలు ఇది ఎలా తయారుచేస్తారో తెలుసుకుందామా ..?

కావలసినవి:
మటన్‌: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి: టేబుల్‌స్పూను, ఉప్పు: రుచికి సరిపడా, కారం: టేబుల్‌స్పూను, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: టీస్పూను, టొమాటోలు: రెండు, పెరుగు: కప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, మటన్‌ మసాలా: టీస్పూను, గరంమసాలా: అరటీస్పూను.

తయారుచేసే విధానం:
* మటన్‌ ముక్కలను శుభ్రంగా కడిగి, అందులో కొద్దిగా నూనె, ఉప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి.* ప్రెషర్‌ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత మటన్‌ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, దనియాలపొడి, జీలకర్ర, మటన్‌ మసాలా పొడి వేసి రెండు నిమిషాల పాటు సిమ్‌లో ఉడికించాలి. తరవాత సన్నగా కోసిన టొమాటో ముక్కలు వేసి అవి ఉడికాక పెరుగు వేసి కలపాలి. నూనె తేలే వరకూ ఉడికించి, కొద్దిగా నీళ్లు, కొత్తిమీర తురుము వేసి మూతపెట్టి సిమ్‌లో ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. చివరగా గరంమసాలా, మరికాస్త కొత్తిమీర చల్లి దించాలి.