Home / LIFE STYLE / పెళ్ళి లో మూడు ముళ్ళు.. ఏడు అడుగులే ఎందుకో తెలుసా ..?!!

పెళ్ళి లో మూడు ముళ్ళు.. ఏడు అడుగులే ఎందుకో తెలుసా ..?!!

ఇద్దరు మనుషులను ఒక్కటి చేసేది పెళ్లి. అప్పటి వరకు విభిన్న వాతావరణం, వైవిద్యమైన ఆలోచనలతో, ఆశలు, ఆకాంక్షలతో పెరిగిన రెండు జీవన స్రవంతులను ఒక్కటిగా చేసే వేడుక. అప్పటివరకూ ఒంటరిగా సాగిన వారి ప్రయాణం.. ఇక అప్పటి నుంచి జంటగా మారుతుంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంటుంది. ఇప్పుడంటే 5గంటల్లోనే ముగిస్తున్నారు కాని పాత కాలంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుండేది. బంధు మిత్రులతో భాజా బజంత్రీలతో అదో కోలాహలం. అయితే పెళ్లి వేడుకలో సమయం తగ్గినా ఆ తంతులో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాని నేటి తరానికి అవేమిటో మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడు? తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడూ ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు? అనే విషయాలు చాలా మందికి తెలియని ఆసక్తికరం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడు:
మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడంటే.. హిందూ సంప్రదాయం ప్రకారం మూడు అనే సంఖ్యకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరమని భావించేవారు మన పెద్దలు. అందుకే మంగళ సూత్రానికి ఈ మూడు ముళ్ళు అనే నియమం వచ్చింది. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవులకు స్థూల ,సూక్ష్మ,కారణ అనే మూడు శరీరాలు ఉంటాయట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట. పెళ్ళంటే ఒక్క భాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవడం అనే అర్ధంలో మూడు ముళ్ళు వేస్తారు.

తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడు ప్రదిక్షణలే ఎందుకు చేస్తారు:
సాధారణంగా ఏడూ అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అనే బాస చేస్తున్నట్లని చెబుతారు. దీన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధూవరులకు.. ఒకరికి ఒకరు ఇస్తున్నట్టు లెక్కట. ఇందులో…

మొదటి అడుగు :అన్నవృద్దికి.. మన దేశాన్ని గతంలో అన్నపూర్ణ గ పిలిచేవారు. దానికి తోడు మన జీవన ఆధారం వ్యవసాయం. అందుకే మొదటి అడుగు పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది.

రెండవ అడుగు :బల వృద్దికి.. నూతన వధూవరులు తో పాటు ఇరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు.
మూడవ అడుగు :ధన ప్రాప్తి కలగాలని వేస్తారు.

నాల్గవ అడుగు :ఆలుమగల్లో సదా సుఖ సంతోషాలు వెల్లి విరియాలని వేస్తారు.
ఐదవ అడుగు : మనిషి సంఘ జీవి. తాను, తన కుటుంబమే కాకుండా సమాజానికి కూడా తనకు చేతనైన మేరకు సహాయం చేస్తానని చెబుతూ వేసే అడుగు ఇది.
ఆరవ అడుగు :దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు ,అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని వేసేది.
ఏడవ అడుగు :శారీరకంగా, మేధో పరంగా పుష్టి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat