Home / TELANGANA / చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!

చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!

తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంచతరించుకుంది. టీటీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితర నేతలు బాబుతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు..అయితే టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా..అలాంటి కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని మోత్కుపల్లి లాంటి సీనియర్ నేతలు రేవంత్‌తో విభేదిస్తున్నారు. ఒకవేళ పొత్తు విషయమై ఆలోచిస్తే బీజేపీ, టీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని మోత్కుపల్లి తేల్చిచెప్పాడు..ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌తో కలిస్తే మా ఇంటి వాళ్లు కూడా ఇంట్లోకి అడుగుపెట్టనివ్వరని రేవంత్‌ మోత్కుపల్లికి కౌంటర్ ఇచ్చాడు..ఈ నేపథ్యంలో టీటీడీపీలో పొత్తుల విషయంలో గందరగోళం నెలకొంది. ఒక్క రేవంత్‌ తప్ప మిగిలిన నేతలెవ్వరు కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకోవడానికి సముఖంగా లేరు.. దీంతో ఇవాళ భేటీలో పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే అధ‌్యక్షుడు చంద్రబాబు కూడా టీఆర్ఎస్‌తో పొత్తు విషయమై సమాలోచన చేస్తున్నాడు. ఇటీవల కాలంలో కేసీఆర్‌‌తో సన్నిహిత సంబంధాలు నెలకొంటున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా, ప్రభుత్వపరంగా, ఓటుకు నోటు కేసులో ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ఇప్పుడు టీడీపీ కంటే అధికార టీఆర్ఎస్‌కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే అన్నిరకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు భావిస్తున్నాడని సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్‌ను ఈజీగా ఓడిస్తామని వాదిస్తున్నాడంట..అయితే అధిష్టానం మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే అది ఏపీలో తమకు ప్రతికూలంగా మారుతుందని భావిస్తోంది..మొత్తానికి ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని యధావిధిగా కొనసాగించి ఎన్నికల సమయానికి రాజకీయ సమీకరణాలను బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు టీటీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబు, టీటీడీపీ నేతల మధ్య భేటీ తెలంగాణ టీడీపీలో ఉత్కంఠను రేపుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat