Home / SLIDER / నారాయణమూర్తికి మరో పురస్కారం

నారాయణమూర్తికి మరో పురస్కారం

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కొమురం భీమ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్‌ అవార్డును ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సినీ రంగంలో అతను చేసిన కృషికి ఫలితంగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వీరితో పాటు సురభి కళాకారుడు ఆర్‌. నాగేశ్వరరావుకు కూడా రామినేని పురస్కారం వరించింది. ఈ నెల 12న విజయవాడలో డా. రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హజరుకానున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat