Home / LIFE STYLE / సిగరెట్ తాగడం మనేయ్యాలంటే ఈ రసం త్రాగండి..!

సిగరెట్ తాగడం మనేయ్యాలంటే ఈ రసం త్రాగండి..!

సిగరెట్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది..భార్య ఏమి చెప్పినా వినే భర్త..సిగరెట్స్ మానమంటే మానడు..అంతగా చాలా మంది వీటికి అలవాటు పడి..జబ్బులకి లోనయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాలతో ఎంతో మంది చనిపోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కూడా. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగరెట్స్ త్రాగితే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు ప్యాకేట్స్ మీద వ్రాసినా అవేమి పట్టించుకోలేదు.

అయితే ఒక చిన్న ఆకు రసం సిగరెట్స్ మీద వ్యామోహాన్ని తొలగిస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.అదేమిటంటే క్యాబేజీ ర‌సం తాగినా లేకా ఆకులు న‌మిలినా వాళ్లు ఇక సిగ‌రెట్లు మ‌ర్చిపోతార‌ట‌. క్యాబేజీకి పోష‌కాల గ‌ని అన్న పేరు ఉంది.క్యాబేజీలో పోష‌క విలువ‌లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇది క్యాన్స‌ర్ ని వారించ‌డంలో కూడా స‌మృద్ధిగా ప‌నిచేస్తుంది.క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా “పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్” ప్రభావాన్ని తగ్గించవచ్చునని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

అలాగే మీ శ‌రీరంలో ఏదైనా ప్ర‌దేశంలో వాపులు ఉంటే రాత్రి ప‌డుకునే ముందు అక్క‌డ కొన్ని క్యాబేజీ ఆకులు ఉంచితే తెల్లారేస‌రికి ఆ వాపులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. పాలిచ్చే తల్లులు ఒక్కోసారి వక్షోజాలు , నిప్పుల్స్ లో నొప్పి ,మంట కలుగుతాయి అప్పుడు ఈ క్యాబేజీ ఆకులని వాటి మీద ఉంచితే చాలు సమస్య పరిష్కారం అవుతుంది. క్యాబేజీ ర‌సం తాగ‌ల‌ని వాళ్లు, ఆకులు న‌మ‌ల‌లేని వాళ్లు చ‌క్కెర క‌లుపుకుని తాగినా స‌రిపోతుంద‌ట‌. ఇలా రెండు నెల‌లు చేస్తే ఆ త‌ర్వాత వాళ్లు సిగ‌రెట్ అన్న ప‌ద‌మే మ‌ర్చిపోతార‌ట‌. ఇక క్యాబేజీలో నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా ఉన్నాయి. ఇక సిగరెట్స్ మానని వాళ్ళకి మీరు ఈ క్యాబేజీ మన్పించే ప్రయత్నం చేయండి…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat