Home / MOVIES / సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌మ‌ణిర‌త్నం కొత్త స్కెచ్..!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌మ‌ణిర‌త్నం కొత్త స్కెచ్..!

ప్ర‌ముఖ దర్శకుడు మణిరత్నం కొత్త స్కెచ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్కెచ్ అంటే వేరే ఏదో కాదు లెండి.. తన కొత్త సినిమాకు సంబంధించి కేరక్టర్ ఆర్టిస్టులు.. టెక్నీషియన్స్ స్కెచ్ లను విడుదల చేశారు. వాటినే రిలీజ్ చేస్తూ.. తన కొత్త చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారఎప్పటిలాగానే తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పైనే ఈ చిత్రం రూపొందనుండగా.. ప్రొడక్షన్ నెం17 అంటూ మణిరత్నం కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన పాత్రధారులను ఇంట్రడక్షన్ ఇస్తూ ఒకేసారి మొత్తం టీం అంతటి స్కెచ్ లను రిలీజ్ చేశారు మణి రత్నం.

ఇవే ఇప్పుడు ఆన్ లైన్ ట్రెండింగ్ అయిపోయాయి. ఒక్కో పాత్రకు సంబంధించిన స్కెచ్.. విపరీతంగా షేర్ అయిపోతూ.. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. సినిమాపై విపరీతమైన ఆసక్తి కలిగిస్తున్నాయి. అసలు ఈ మూవీ క్యాస్టింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. తమిళ స్టార్లు శింబు.. విజయ్ సేతుపతి.. అరవింద్ స్వామి.. మలళయాళం నుంచి ఫదా ఫాజిల్.. ఇంకా సీనియర్ హీరోయిన్ జ్యోతిక.. అందాల భామ ఐశ్వర్యా రాజేష్ లు ఈ మూవీ ప్రధాన పాత్రధారులు. ఇంత భారీ క్యాస్టింగ్ ను ఒక చోటకు తీసుకురావడం తన వల్లనే సాధ్యమవుతుందని మణిసార్ మరోసారి ప్రూవ్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat