ఉద్యోగులకు నోకియా బ్యాడ్ న్యూస్ .. – Dharuvu
Home / TECHNOLOGY / ఉద్యోగులకు నోకియా బ్యాడ్ న్యూస్ ..

ఉద్యోగులకు నోకియా బ్యాడ్ న్యూస్ ..

దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు షాకిచ్చేందుకు ప్రముఖ మొబైల్ వ్యాపార సంస్థ అయిన నోకియా సిద్ధమైంది .దీనిలో భాగంగా తమ సంస్థలో పని చేసే ఉద్యోగులను తగ్గించే ప్రయత్నంలో ఉంది .అందులో భాగంగా నోకియా టెక్నాలజీస్ యూనిట్ నుంచి మొత్తం 310 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాలని నిర్ణయించింది.

దీని ఫలితంగా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వర్చువల్ రియాలిటీ కెమెరా ‘ఓజో’, హార్డ్‌వేర్ పనులు ఆగిపోనున్నాయి అని సమాచారం .దీనికి సంబంధించి ఈ రోజు మంగళవారం ఈ మేరకు నోకియా మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో ప్రకటించింది.

ప్రస్తుతం ఇక్కడి నోకియా యూనిట్‌లో 1,090 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల కోత ఎక్కువగా ఫిన్లాండ్, అమెరికా, బ్రిటన్‌లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మొన్న జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా నోకియాలో మొత్తం 1,02,000 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు .