యువతి ఆత్మహత్య … తల్లితో – Dharuvu
Home / CRIME / యువతి ఆత్మహత్య … తల్లితో

యువతి ఆత్మహత్య … తల్లితో

మానసిక రుగ్మతతో బాధపడుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం మైసూరు నగరంలోని రాఘవేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. రాఘవేంద్రనగర్‌కు చెందిన మోనికా గంగాడికర్‌(18) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం చదువుతోంది. అయితే కొద్ది కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న మోనికా.. సోమవారం తల్లితో గొడవ పడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించే సమయానికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.