17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోయడం అంటే… – Dharuvu
Home / CRIME / 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోయడం అంటే…

17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోయడం అంటే…

మలక్‌పేటలో గత నెల 29న వెలుగు చూసిన మహిళ దారుణహత్య ఘటనలో మిస్టరీ వీడింది. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వీరిలో ఇద్దరు బాలురు ఉండడంతో జువెనైల్‌హోంకు తరలించారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ లో సోమవారం ఇన్‌స్పెక్టర్‌ అల్లూరి గంగారెడ్డి వివరాలు వెల్లడించారు. మలక్‌పేటకు చెందిన పర్వీన్‌ బేగం(38) ఢిల్లీకి చెందిన ఇక్రాముద్దీన్‌తో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఇక్రాముద్దీన్‌ చంగిచర్లలో మలక్‌పేట వాసి తఖీ అఫ్సర్‌తో కలిసి కొబ్బరి పీచు వ్యాపారం చేస్తున్నాడు. పని స్థలానికి పర్వీన్‌బేగం తరచూ ఇక్రాముద్దీన్‌తో వెళ్లేది. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన అమీర్‌ చంద్‌ (19)తోపాటు మరో ఇద్దరు బాలురను తరచూ మాటలతో వేధించేది. ఓసారి చెప్పుతో కొట్టి అవమానించిందని అమీర్‌చంద్‌, ఆ ఇద్దరు బాలురు ఆమెపై కక్ష తీర్చుకోవాలని పథకం వేశారు. ఇక్రాముద్దీన్‌ వూరిలో లేని సమయం చూసుకుని గతనెల 25న రాత్రి పర్వీన్‌బేగం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్లారు. అమీర్‌చంద్‌, 17 ఏళ్ల బాలుడు ఆమెపై అత్యాచారం చేసి కత్తితో మెడ కోశారు. అనంతరం ఇంటికి తాళం వేసి మూసీ ఒడ్డున కత్తి, తాళంచెవి పారేశారు. హత్య విషయం 29న వెలుగు చూడగా పోలీసులు విచారణ చేపట్టారు. పర్వీన్‌బేగం చరవాణి, అసోంకు చెందిన 15 ఏళ్ల బాలుడి ఆచూకీ కనిపించడంలేదంటూ ఇక్రాముద్దీన్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సోమవారం నగరానికి వచ్చిన బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఈమేరకు అమీర్‌చంద్‌ను అరెస్ట్‌ చేసి న్యాయస్థానానికి తరలించారు. ఇద్దరు బాలురను హైదరాబాద్‌ బాలల న్యాయ మండలి ముందు హాజరుపరిచినట్లు సీఐ వివరించారు. సమావేశంలో సెక్టార్‌ ఎస్సై లింగం రమేశ్‌ పాల్గొన్నారు.