ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి… – Dharuvu
Home / SPORTS / ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి…

ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి…

ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టు టీంఇండియా తో ట్వంటీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న సంగతి తెల్సిందే .మూడు మ్యాచ్ ల సిరిస్ లో మొదటి మ్యాచ్ టీంఇండియా గెలిచింది .నిన్న గౌహతిలో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గెలిచిన సంగతి తెల్సిందే .అయితే తాజాగా గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. అనుకోకుండా జరిగిన దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి ఘటన నుంచి ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన నిన్న మంగళవారం అక్టోబర్-10న రాత్రి దాడి జరిగింది.