కన్న తల్లిపై అత్యాచారం… కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి – Dharuvu
Home / CRIME / కన్న తల్లిపై అత్యాచారం… కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి

కన్న తల్లిపై అత్యాచారం… కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి

దేశంలో ప్రతి రోజు ఖచ్చితంగా మహిళలపై అత్యంతా దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్ళుమూసుకునిపోయిన కామాంధుడు ఒకడు.. కన్నతల్లిపైనే కన్నేశాడు. పీకల వరకు మద్యం సేవించి అమ్మపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కన్నబిడ్డ చేస్తున్న పాడుపనికి షాక్ తిన్న తల్లి ప్రతిఘటించింది. దీంతో ఆమెను కొట్టి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే…

మధ్యప్రదేశ్‌లోని కైలారస్ గ్రామానికి చెందిన సూరజ్ మిట్టల్(24) అనే యువకుడకి మద్యం సేవించే అలవాటు ఉంది. మిట్టల్ తన తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈ మహిళ భర్త ఎనిమిదేళ్ళ క్రితం చనిపోయాడు. అయితే, మద్యం మత్తులో ఉన్న మిట్టల్.. తన తల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆవిడ ప్రతిఘటించింది.

తాగిన మైకంలో ఉన్న సూరజ్.. తల్లిని బండరాయితో మోది హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఇంట్లోనే నిద్రపోయాడు. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సూరజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.