డేరా బాబా కోసం అల్లర్లు.. సంచ‌ల‌న విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..! – Dharuvu
Home / CRIME / డేరా బాబా కోసం అల్లర్లు.. సంచ‌ల‌న విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..!

డేరా బాబా కోసం అల్లర్లు.. సంచ‌ల‌న విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..!

డేరా బాబా దత్తత పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ నిజం ఒప్పుకోవడమే కాకుండా నిర్ఘాంతపోయే విషయాలను.. సిట్ అధికారుల విచారణలో బయటపెట్టింది. హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణం అని అంగీక‌రించింది. త‌మ అనుచ‌రుల సాయంతో అల్లర్లకు తానే గైడ్‌ మ్యాప్‌లు తయారుచేశానని చెప్పింది. హనీప్రీత్‌ ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. డేరా హత్య కేసులో దోషిగా తేలగానే ఆగస్ట్ 25న పంచకులలో హింసాకాండ మొదలైంది. దీనికి మొత్తం బాధ్యత హనీప్రీత్ దే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇక ఆ తర్వాత చాలా రోజుల పాటు తప్పించుకు తిరిగిన హనీప్రీత్ పోలీసులకు దొరికిపోయింది. మొదట్లో ఏ సమాచారం ఇవ్వని హనీప్రీత్ రెండో సారి కూడా రిమాండ్ విధించడంతో నిజం ఒప్పుకుంది. ఆ ఒక్క రోజు అల్లర్ల కోసం ఏకంగా ఒక కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలు పంచామని ఒప్పుకుంది. ఇక బాబాకు ఏమైనా జరిగితే దేశం మొత్తం తగలబడి పోతుందని చెప్పించిన వీడియో అలాగే గైడ్ మ్యాపులు ఆమె ఫోన్, ల్యాప్ టాప్ లలో పోలీసులకు దొరికాయి. ఇంకా ఎన్నో సంచలన విషయాలు హనీప్రీత్ అలియాస్ ప్రియాంక తనేజా బయటపెట్టిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.