నెహ్రా సంచలన నిర్ణయం … – Dharuvu
Home / SPORTS / నెహ్రా సంచలన నిర్ణయం …

నెహ్రా సంచలన నిర్ణయం …

టీమ్‌ఇండియా సీనియర్ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది.వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖున న్యూజిలాండ్‌తో సొంతగడ్డ దేశ రాజధాని మహానగరం దిల్లీలో జరిగే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు! దీనికి సంబంధించి టీం ఇండియా కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో చర్చించిన నెహ్రా టీమ్‌ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం.

అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన 38 ఏళ్ల నెహ్రా అనూహ్యంగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే వచ్చే ఏడాది షెడ్యూల్‌ ప్రకారం టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశం లేకపోవడమే నెహ్రా రిటైర్మెంట్‌కు కారణమని బీసీసీఐ అధికారి ఒకరుచెప్పుకువచ్చారు .ప్రస్తుత పరిస్థితుల్లో కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరముందని ఈ సీనియర్ ఆటగాడు టీమ్‌మేనేజ్‌మెంట్‌కు చెప్పాడని సమాచారం .

వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో కూడా నెహ్రా ఆడకపోవచ్చు. సరిగ్గా పద్దినేమిది యేండ్ల కిందట అంటే 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా టీం ఇండియా తరఫున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతే కాకుండా 2011లో ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో నెహ్రా సభ్యుడు.