బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..? – Dharuvu
Home / ANDHRAPRADESH / బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?

బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఫైర్ -ఈసారి కొంచెం కొత్తగా ..?

ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వివాదస్పద వ్యాఖ్యల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఫైర్ బ్రాండ్ ,వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మరోసారి టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ నిధుల కోసం కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయలేకపోతున్నారని ఆమె అన్నారు.. రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, చంద్రబాబు జల్సాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు పాలన నుంచి కాపాడాలన్న బాధ్యతతోనే జగన్ నవంబర్ రెండు నుంచి పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీ కి బ్రాండ్ లాంటిదని.. కచ్చితంగా జగన్ చేసే పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందన్నారు.. ఇప్పటికే వైసీపీ నిర్వహించిన యువభేరి విజయవంతం కావడంతో మంత్రులకు పిచ్చెక్కిందని.. పాదయాత్ర కు వస్తున్న స్పందన చూసిన తర్వాత వారు మరింత ఢీలా పడతారని ఆమె అన్నారు.