మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ .. – Dharuvu
Home / ANDHRAPRADESH / మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..

మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అట్లాంటి ఇట్లాంటి వార్తలతో కాదు ఏకంగా జపాన్ ను టార్గెట్ చేస్తూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన రామినేని ఫౌండేషన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పని చేసేవారికి .కన్నభూమి గురించి ఆలోచించేవారికి అవార్డులను ఇవ్వడం చాలా సంతోషకరం అని ఆయన అన్నారు .అంతే కాకుండా ఒకప్పుడు ఇకరు ముద్దు ఇద్దరు వద్దు అని సంతానాన్ని కంట్రోల్ చేస్కునే విధంగా ప్రచారం చేశాను .దాదాపు పదేండ్ల పాటు ఆ కార్యక్రమం చాలా విజయవంతమైంది .

కానీ ప్రస్తుతం మారుతున్నా పరిస్థితుల నేనే పిలుపునిస్తున్నా ఎక్కువ సంతానాన్ని కనాలని చెబుతున్నాను అని ఆయన అన్నారు .లేకపోతే రానున్న రోజుల్లో ఏపీ మరో జపాన్ లా మారుతుంది అని ఆయన అన్నారు .అంతకు ముందు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరికి ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం ప్రదానం చేశారు. హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ గీతా కె వేముగంటి, సురభీ రంగస్థల కళాకారులు ఆర్.నాగేశ్వరరావు, ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తికి కూడా విశేష పురస్కారాలు అందజేశారు.అయితే జనాభా పెరగడం వలన భూమి పెరగదు ..పంచ భూతాలు పెరగవు ..ఉద్యోగ సమస్య ఎక్కువతుంది అని ప్రచారం చేసిన బాబు ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆయనకు తెల్సి అన్నాడా ..లేదా నోరు జారడా అని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు ఎక్కు పెట్టారు ..