లక్షమంది ఉత్తమ్‌లు వచ్చినా కాళేశ్వరాన్ని అడ్డుకోలేరు.. – Dharuvu
Home / SLIDER / లక్షమంది ఉత్తమ్‌లు వచ్చినా కాళేశ్వరాన్ని అడ్డుకోలేరు..

లక్షమంది ఉత్తమ్‌లు వచ్చినా కాళేశ్వరాన్ని అడ్డుకోలేరు..

సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సాధనను జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలో టీఆర్‌ఎస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ప్రజలు తమని గెలిపించారని సీఎం అన్నారు.

లక్షమంది ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అడ్డుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టితీరుతమని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. ఖమ్మం, నల్లగొండలో వేలాది ఎకరాలను ముంచేసి పులిచింతల కట్టిన్రు.

పులిచింతల నిర్వాసితులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంత అని సీఎం ప్రశ్నించారు? పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు నోరు మొదపలేదని దుయ్యబట్టారు. ప్రజల మేలు కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదన్నారు. తెలంగాణలో ఎవరికి ఏ అవసరముందో తనకు అణువణువూ తెలుసన్నారు.