సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అందజేత .. – Dharuvu
Home / TELANGANA / సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అందజేత ..

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు అందజేత ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్థానికంగా ఉన్న గొల్లబజార్‌లో నిర్మించిన 192 డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందజేయడానికి స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధ్యక్షతన నిన్న లాటరీ పద్దతిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఇవాళ పట్టాల పంపిణీ జరిగింది.లబ్దిదారుల చేత సీఎం సామూహిక గృహప్రవేశం చేయించారు.