Breaking News
Home / CRIME / వాటిని కట్ చేయించి.. ఏకంగా నాలుగు వందల మందిని..!

వాటిని కట్ చేయించి.. ఏకంగా నాలుగు వందల మందిని..!

డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకు తమ విచారణలో షాక్‌ తినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి డేరా బాబా ఏకంగా 400 మంది నపుంసకులుగా మార్చినట్లు ఇప్పటి దాకా జరిగిన విచారణలో తేలింది. డేరా బాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణను ప్రారంభించిన సీబీఐ.. డేరాలోని డాక్టర్లే వీరిందరికీ చికిత్సలు చేశారని గుర్తించారు.

ఈ క్రమంలోనే డేరా బాబా పీఏ రాకేష్‌.. న్యాయసలహాదారు దాస్‌లకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ వృషణాలు లేవని తేలింది. దీంతో, మరింత సీరియస్‌గా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడం ప్రారంభించింది. డేరాలో స్త్రీలనందరినీ శృంగారానికి వాడుకునే బాబా.. పురుషలను మాత్రం నపుంసకులుగా మార్చేవాడని తమ దర్యాప్తులో పక్కా ఆధారాలతో తేలిందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకెన్ని డేరా-ఘోరాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

About vinzz hunt

Check Also

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు..

తెలంగాణ  రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని …

error: కాపీ చేయడం నిషిధ్ధం !