జగన్ పాదయాత్రపై ఎంపీ గీత షాకింగ్ కామెంట్స్ .. – Dharuvu
Home / ANDHRAPRADESH / జగన్ పాదయాత్రపై ఎంపీ గీత షాకింగ్ కామెంట్స్ ..

జగన్ పాదయాత్రపై ఎంపీ గీత షాకింగ్ కామెంట్స్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారిఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో మొత్తం మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల గురించి చెప్పి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ తుంగలో తోక్కడమే కాకుండా ..

ప్రత్యేక హోదా విషయం లో ఏపీ ప్రజలను ఎలా మోసం చేశారో వివరించడానికి జగన్ ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు .తాజాగా జగన్ పాదయాత్రపై వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె మాట్లాడుతూ జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం అవుతారంటే మూర్ఖత్వమేనని ఆమె విమర్శించారు.

ఏపీకి ప్రత్యేకహోదా రాదని అప్పటి.. ఇప్పటి నాయకులందరికీ తెలుసని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన వాగ్దానమే ప్రత్యేక హోదా అని ఆమె తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమన్నారు.అయితే ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన వాగ్దానమే ప్రత్యేక హోదా అని అనడం బాబును టార్గెట్ చేసినట్లు అవుతుంది రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .