సూర్యాపేట లో వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ .. – Dharuvu
Breaking News
Home / SLIDER / సూర్యాపేట లో వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ..

సూర్యాపేట లో వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. టౌన్ లో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా ప్రతీ మండలంలో చెరువులు ఆధునీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నమన్నారు. ఏ ఊరైనా ఏ తండా అయినా తనదేనన్న సీఎం ఈ సందర్భంగా సూర్యాపేటకు పలు వరాలను ప్రకటించారు. సూర్యాపేట అభివృద్ధికి రూ. 75 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు . వచ్చే ఏడాది బడ్జెట్‌లో పాత నల్లగొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు ఇస్తాం ..అందులో ఒకటి పాత నల్లగొండలో మరొకటి సూర్యాపేటలోఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు .

సూర్యాపేటలోని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ. 15 లక్షలతో పాటుగా ప్రతీ తండాకు రూ. 10 లక్షలు ఇస్తాం అని ప్రకటించారు . సూర్యాపేట పుల్లారెడ్డి చెరువును బాగుచేయడంలాంటి హామీల వర్షం కురిపించారు .అయితే మీరు కోరినవన్నీ ఇస్తాం .కానీ మీరు సూర్యాపేట జిల్లాలో ప్రతీ ఇంటికీ ఆరు మొక్కలు పెంచాలని సీఎం ప్రజలను కోరారు. వెయ్యి కోట్లు అప్పు తెచ్చయినా సరే పాత నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేస్తానని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.