తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కేసీఆర్ సర్కారు దీపావళి కానుక .. – Dharuvu
Home / SLIDER / తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కేసీఆర్ సర్కారు దీపావళి కానుక ..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు కేసీఆర్ సర్కారు దీపావళి కానుక ..

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు పోస్టులు మంజూరయ్యాయి. 22 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం 1,445 పోస్టులను మంజూరు చేసింది. మొత్తం పోస్టుల్లో 880 లెక్చరర్ పోస్టులున్నాయి.

పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్లు -88, ఆఫీస్ సబార్డినేట్ 88, స్టాఫ్ నర్స్- 44, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు -44, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ -22, సూపరింటెండెంట్స్ -22, వార్డెన్స్- 22, స్టోర్ కీపర్స్ -22, కేర్ టేకర్స్- 22, సీనియర్ అసిస్టెంట్స్ -22 తోపాటు ఇతర పోస్టులున్నాయి