నాడు స‌మంత‌.. నేడు ర‌కుల్‌..! – Dharuvu
Breaking News
Home / MOVIES / నాడు స‌మంత‌.. నేడు ర‌కుల్‌..!

నాడు స‌మంత‌.. నేడు ర‌కుల్‌..!

తెలుగులో అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళ, భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఓ ప‌థ‌కానికి ర‌కుల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయింది. గ‌తంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ని తెలంగాణ రాష్ట్రం భేటీ బచావో భేటీ పడావ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్‌ప్రీత్ సింగ్ తనకి వచ్చిన ఈ అవకాశంపై ఆనందం వ్యక్తంచేసింది. తన నియామకాన్ని ఓ గౌరవంగా భావిస్తానని పేర్కొన్న రకుల్‌ప్రీత్ సింగ్.. సమాజంలో మార్పు మొదలవడానికి కృషిచేద్దాం అంటూ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుందామె. రకుల్‌ స్వస్థలం ఢిల్లీనే అయినప్పటికీ.. ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడటమే కాకుండా ఇటీవలే హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఫిట్‌నెస్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా తాను చివరిగా హైదరాబాద్‌లోనే స్థిరపడతానని స్పష్టం కూడా చేశారు.