Home / NATIONAL / నోట్ల రద్దు, జీఎస్టీ రాంగ్ డెసిషన్స్.. మోదీ, జైట్లీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు..!

నోట్ల రద్దు, జీఎస్టీ రాంగ్ డెసిషన్స్.. మోదీ, జైట్లీపై యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు..!

బిజేపీ సీనియర్ నేత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రిపై విమర‌్శల వర్షం కురిపించారు బిజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా..మోదీ ఈ మూడేళ్లలో తీసుకున్న రెండు అతి పెద్ద నిర్ణయాలైన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు బిజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. దేశంలో జీఎస్టీ అమలు తీరు ఆందోళన కరంగా ఉందని, నోట్ల రద్దు ఆర్థిక విపత్తుగా మారిందని యశ్వంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తీసుకున్న ఈ రెండు ప్రధాన నిర్ణయాల వల్ల ప్రజలు పేదరికంలో మగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందని..సిన్హా ఆరోపించారు. వ్యవసాయ రంగం కునారిల్లుతుందని, తయారీ రంగం కుప్పకూలిపోయిందని, ప్రైవేట్ పెట్టుబడులు బాగా తగ్గిపోయాయని, నిర్మాణ రంగ పరిశ్రమ తిరోగమనంలో ఉందని, సేవల రంగం మందగించిందని, ఎగుమతులు బాగా తగ్గిపోయాయని ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఏం బాలేదని , జీఎస్టీపై సరిగా హోం వర్క్ చేయకుండా అమలు చేశారని, ఇప్పుడు జీఎస్టీవల్ల సామాన్యుల మీద భారం పడుతుందని, ఈ రెండు ప్రధాన నిర్ణయాల వల్ల దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు కోల్పోయారని , ఆర్థిక మంత్రి జైట్లీ దేశ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు..ఇప్పుడు మాట్లాడకపోతే దేశ పౌరుడిగా తన విధి నిర్వహణలో వైఫల్యం చెందినట్లే అన్న సిన్హా ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని , మెజార్టీ బిజేపీ నేతల అభిప్రాయం కాని..వారు మాట్లాడడానికి భయపడుతున్నారని,..నేను ధైర్యంగా మాట్లాడుతున్నానని కుండ బద్దలు కొట్టారు. వృద్ధి రేటు పెరుగుతుందనడం అబద్ధమని నిజానికి మోదీ సర్కార్ కొత్త గణాంక ప్రక్రియను తీసుకువచ్చిందని..అందుకే వృద్ధి రేటు 5.7 శాతం కనిపిస్తుందని..కానీ త్రైమాసిక వృద్ధి రేటు 3.7 శాతం మాత్రమేనని వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ఆర్థిక పురోగమనం అసాధ్యమేనని యశ్వంత్ సిన్హా తేల్చి చెప్పారు..ఈ సీనియర్ నేత తన కొడుకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకుని క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు..అలాంటిది సడన్‌గా మీడియా ముందుకు వచ్చి మోదీ నిర్ణయాలను తప్పపట్టడం బిజేపీలో చర్చనీయాశంగా మారింది. మాజీ ఆర్థిక మంత్రి అయిన సిన్హా ప్రస్తుత ఆర్థిక మంత్రి జైట్లీని టార్గెట్ చేస్తున్నాడా..లేక పరోక్షంగా ప్రధాని మోదీపై ఆరోపణలు సంధిస్తున్నారా? అన్న చర్చ ఇప్పుడు బిజేపీలో జరుగుతోంది. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ‌్యంలో సొంత పార్టీ నేత యశ్వంత్ విమర్శలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat