ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ చేరడానికి ముహూర్తం ఖరారు అయింది .ఈ క్రమంలో రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ వైసీపీ ఎంపీ బుట్టా రేణుక అధికారపార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.
రేపు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.అయితే వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.
అయితే పార్టీ మారడానికి బాబు వంద కోట్లు డబ్బులతో పాటుగా ఐదు వందల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టనున్నారు అని ఇటీవల ప్రముఖ న్యూస్ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెల్సిందే .