Home / SPORTS / అనుష్కను ప్రేమించడానికి అసలు కారణాన్ని చెప్పిన కోహ్లి

అనుష్కను ప్రేమించడానికి అసలు కారణాన్ని చెప్పిన కోహ్లి

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై నోరు మెదపకపోయినా.. వాళ్ల సెల్ఫీలు, విహార యాత్రలు, డేటింగ్‌లు అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఇటు విరాట్‌గానీ అటు అనుష్కగానీ ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడలేదు. అయితే ఈ మధ్య బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్‌తో కలిసి కోహ్లి ఓ దివాళీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నపుడు అనుష్కశర్మ గురించి అతను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఆమె నిజాయతీ, కేరింగ్ నేచర్ నాకు బాగా నచ్చుతాయి. తాను అనుష్కను ప్రేమించడానికి అసలు కారణాన్ని చెప్పాడు కోహ్లి.

అనుష్కలో బాగా నచ్చే గుణం ఆమె నిజాయతీయని, ఈ లక్షణమే ఆమెను ప్రేమించేలా చేసిందని అన్నాడు కోహ్లి. తనతో ప్రేమలో పడ్డ తరువాత ఆమె నుండి చాలా నేర్చుకున్నానని ఆయన తెలిపాడు. అమీర్‌ఖాన్‌ హోస్ట్‌గా నిర్వహించిన ఓ షోలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు కోహ్లి. ఇక ఆమెకు కోహ్లి నుష్కీ అనే ముద్దుపేరును పెట్టినట్లు కూడా ఈ షోలో వెల్లడించాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat