Home / MOVIES / అవి చూపించను…. ఎక్స్‌పోజింగ్‌ను..మాత్రం…కీర్తీ సురేష్

అవి చూపించను…. ఎక్స్‌పోజింగ్‌ను..మాత్రం…కీర్తీ సురేష్

తెలుగు, తమిళంలో మంచి అవకాశాలతో అతి తక్కువ కాలంలోనే జోరు పెంచిన నటి కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. ఓ వైపు తెలుగులోనే వరుసపెట్టి మరీ సినిమాలను దక్కించుకుంటుంది.. అయితే తన నుంచి గ్లామర్ , మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌ను అస్సలు ఉహించుకోవద్దని తెగేసి చెబుతుంది కీర్తీ సురేష్. తనను సంప్రదాయబద్ధమైన పాత్రల్లో చూడటానికే ఇష్టపడతారు అని తను అలానే కొనసాగుతానని కీర్తీ అంటోంది. ఇది వరకే ఈ విషయాన్ని ఈమె స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందో, ఎలాంటి సినిమాలు వస్తున్నాయో వేరే వివరించనక్కర్లేదు. లిప్‌లాక్ సీన్లు, బికినీ పోజులు సినిమాల్లో ఉంటున్నాయి. హీరోయిన్లు కూడా అలాంటివన్నీ మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

తన నుంచి ఎక్స్‌పోజింగ్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొద్దు, గ్లామర్ ను ఒలకపోసే ప్రసక్తే లేదు.. అని ఈమె కుండబద్ధలు కొడుతోంది. తను ఇంత వరకూ సాంప్రదాయమైన పాత్రలే చేశానని, ఇకపై కూడా అలాంటి పాత్రలే చేస్తానని స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం కీర్తీ ‘మహానటి’ తో పాటు త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat