Home / POLITICS / కోదండరాం కి మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న…

కోదండరాం కి మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న…

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు  సిద్ధిపేట పర్యటనలో పర్యటించారు  .ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ, కోదండ రామ్ లను నిలదీయండి. కుట్రపన్నుతున్న వాళ్లను ప్రశ్నించండని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.సిద్ధిపేట జిల్లా వాసులు బతకడం ఇష్టం లేదా అంటూ కోదండ రామ్ ను సూటిగా ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడిచినా గోదావరి నీళ్లు తెచ్చింది లేదంటూ ప్రతి పక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై మంత్రి హరీశ్ రావు విరుచుకు పడ్డారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఒక వర ప్రధాయిని, అని మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా సిద్ధిపేట జిల్లాతో పాటు యాదాద్రి, నిజామాబాదు, రంగారెడ్డి, మేడ్చేల్, హైదరాబాదు జిల్లాల రైతాంగానికి మేలు చేకూరుతుందని ప్రతిపక్షాలు అడ్డగోలు, అనవసర రాద్ధాంతాలు చేయడం తగదని ప్రతిపక్షాల తీరుపై మంత్రి మండిపడ్డారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందుతుందని వివరిస్తూ.., గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతదని.., ప్రతి పక్షాలు, కోదండ రామిరెడ్డిలు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ.. ఇక్కడి జిల్లా ప్రజల ఉసురు పోసుకుంటున్నారే.., తప్ప ఇంకేమీ లేదని ప్రతి పక్షాల తీరును నీళ్ల మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్ధిపేట జిల్లాలో సాగునీరు అందకనే రైతు ఆత్మహత్యలు అవుతున్నాయంటూ.. ఎందుకు అవుతున్నాయంటూ.. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడిచినా మీరేం గోదావరి నీళ్లు తెచ్చింది లేదంటూ కోదండ రామ్, కాంగ్రెస్ పార్టీల తీరును మంత్రి నిలదీశారు.

రైతు చావుకు కారకులు మీరేనంటూ.. జిల్లా రైతాంగం ఉసురు తప్పక మీకు తగులుతుందని., ఆ పాపం మీదేనని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే మంచి పని కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాలైన యాదాద్రి, నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాదు, సిద్ధిపేట జిల్లాల రైతాంగానికి మేలు చేస్తున్నామని., దీనికి విరుద్ధంగా మీరు అడ్డు తగిలితే ఐదు జిల్లాలకు అన్యాయం జరుగుతుందని, అదే జరిగితే ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారంటూ.. కోదండ రామ్, కాంగ్రెస్ పార్టీల తీరుపై మంత్రి ధ్వజమెత్తారు.

– చచ్చిన వారి పేరిట వారి సంతకాలను ఫోర్జరీ చేసి, తప్పుడు కేసులు పెట్టి, శవాల మీద పేలాలు ఏరుకునే వారిలా దిగజారుడు రాజకీయాలకు దిగడం.. మీ దిగజారుడు తనానికి నిదర్శనమంటూ.. కాంగ్రెస్ పార్టీ తీరును మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. జిల్లా ప్రజలకు అన్యాయం చేయడం తగదని ఘాటుగా కాంగ్రెస్ పార్టీ, కోదండ రామ్ లను మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు….

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat