Home / POLITICS / రేవంత్ పార్టీ మారడం ఖాయం -క్లారీటీచ్చిన టీటీడీపీ సీనియర్ నేత ..

రేవంత్ పార్టీ మారడం ఖాయం -క్లారీటీచ్చిన టీటీడీపీ సీనియర్ నేత ..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి నవంబర్ నెల లేదా డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి ,త్వరలో పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తనపై వస్తోన్న వార్తలను కూడా రేవంత్ రెడ్డి ఖండించకపోగా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ నేతలపై గరం గరం అయ్యారు .

అయితే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీడీపీకు గుడ్ బై చెప్పడం ఖాయం అంటున్నారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత .అసలు విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన తెలంగాణ టీడీపీ సీనియర్ నేత అరవింద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుల పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు, ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిందని, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతోందని ఆయన అన్నారు. ఒకవేళ ఆయన పోతే పార్టీకి నష్టం ఏమి ఉండదు అని తేల్చి చెప్పారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat