Home / ANDHRAPRADESH / బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్

బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో కొంతమందికి ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు.

అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట. మిమ్మల్ని చంపేస్తాం.. తిరిగి వచ్చేయండని.. ఇలా ఇప్పటికే 15 నెంబర్ల నుంచి బుట్టా రేణుకకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెంబర్లన్నీ అపరిచితులు చేస్తున్నట్లు రేణుక గుర్తించింది. కానీ పోలీసులకు మాత్రం ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదట.

ఎందుకంటే ఇప్పుడిప్పుడే పార్టీ మారారు కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేస్తే కావాలనే తానేదో కల్పితం చేసుకుని చేస్తున్నానన్న అనుమానం వస్తుందనేది రేణుక ఆలోచన. అందుకే కొత్త నెంబర్లను లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడుతోందట బుట్టా రేణుక.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat