దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ కిట్..! – Dharuvu
Breaking News
Home / EDITORIAL / దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ కిట్..!

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ కిట్..!

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్‌ను రాష్ట్రంలోని  మహిళలు దేవుడిచ్చిన వరంగా భావిస్తు న్నారు. తెలంగాణ  సర్కార్ చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి  పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈక్రమంలోనే సర్కార్ దవాఖానలకు కోట్లాది రూపాయలు కేటాయించి ఆధునిక  సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ ఆస్పత్రు లను తలపిస్తున్నాయి. దీంతోపాటుగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్లకు ఆకర్షితులై కాన్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసవం అయితేనే తల్లీబి డ్డలకు పూర్తి భరోసా ఉంటుందని ఆడబిడ్డలు ఎక్కువగా సర్కారు దవాఖానలకు ఆశ్రయిస్తున్నారు.

ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథ కాలు సత్ఫలితాలిస్తున్నాయి. కేసీఆర్ కిట్స్ మహి ళా లోకం వరంగా భావిస్తోంది. గత పాలకుల వివ క్షకు గురైన తెలంగాణ ప్రజలు సర్కార్ ప్రజోప యోగ కార్యక్రమాలతో సంతృప్తి చెందుతున్నారు. ప్రధానంగా తల్లీబిడ్డల ప్రాణాలకు భరోసా కల్పి స్తూ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ సర్వత్రా చర్చనీ యాంశంగా మారింది. దీంతో ప్రసావాల సంఖ్య పెరుగుతోంది. మొన్నటికి మొన్న నేను రాను సర్కార్ దవాఖానకు అనుకున్న వారు ఇప్పుడు అదే సర్కార్ వైద్యశాలకు పరుగులు పెడుతున్నా రు. ఇక్కడ డెలివరీ అయితేనే తల్లీబిడ్డల ప్రాణా లకు పూర్తి భరోసా ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా ప్రసూతి దవాఖానలకు గర్భిణుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. అసౌకర్యాల నడుమ పురుడు పోసుకున్న ఆడబిడ్డలు ఎన్నో ఇబ్బందులు ఎదర్కొన్న నాటి సర్కార్ దవాఖానలు నేడు కార్పొరేటర్ దవాఖానలను తలదన్నే విధం గా తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుంది. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ దవాఖానలకు అధిక ప్రాధాన్య త ఇస్తోంది.

కడుపు పండిన ఆడబిడ్డ తమకు పుట్టబోయే బిడ్డతోపాటు తల్లి క్షేమంగా ఉండాలని బంధువు లు ఆశించేవారు. ఈనేపథ్యంలో సర్కార్ దవాఖా నలకు వెళ్లితే తల్లీబిడ్డల ప్రాణాలకు భరోసా ఎవరు ఇస్తారనే అపోహ వారిని బయాందోళనకు గురి చేసేది. దీంతో సర్కార్ దవాఖానను ఆశ్రయించ కుండా నేరుగా ప్రైవేట్ దవాఖానలో చేరేవారు. అయితే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా ఆపరేషన్లు నిర్వహించి ప్రసవాలు చేయడం పరి పాటిగా మారిందనే ఆరోపణలున్నాయి.అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి సమస్య తలెత్తినా అందుకు బాధ్యత వహించేవారు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు ఆవేదనకు గుర వుతుండేవారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లీబిడ్డల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కిట్టు అనే వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. రెండు కాన్పులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఒక్కో కాన్పునకు రూ.2 వేల విలువైన కేసీఆర్‌ కిట్‌ అందజేస్తారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే బాలింతలకు రూ.12 వేలు అందిస్తారు. ఆర్థిక భారంతో కొట్టు మిట్టాడే పేద, మధ్యతరగతి ప్రజలు సర్కార్ దవా ఖానపై దృష్టిసారించారు. ఫలితంగా గర్భిణులు నే రుగా సర్కార్ దవాఖానలను సంప్రదిస్తుండ డం తో ఇక్కడి వైద్యులు కోత, కుట్టు లేకుండా సాధార ణ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఇల్లు చేరుతున్నారు.

 

పథకం అమలు.. నిబంధనలు
కేసీఆర్‌ కిట్‌ పథకం వర్తించాలంటే..

 1. గర్భిణులకు బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ కూడా)తో పాటు ఆధార్‌ నెంబర్‌ ఉంటేనే ఈ పథకానికి అర్హులు.
 2. ఇలా నమోదు చేయించుకున్న వారికి ప్రత్యేక ఎంసీ కార్డు (మథర్‌ చైల్డ్‌)ను జారీ చేస్తారు.
 3. గర్భిణుల పేర్లను నమోదు చేసే బాధ్యత ఏఎన్‌ఎంతో పాటు ఆశా వర్కర్లదే.
 4.  గర్భిణులు నమోదును ధ్రువీకరించి, సరైనదేనని నిర్ధారించా ల్సిన బాధ్యత ఆస్పత్రి అధికారులదే.
 5. మెడికల్‌ ఆఫీసర్లు పంపించిన సమాచారాన్ని పరిశీలించి.. దానిని ఆమోదించాల్సిన బాధ్యత డిప్యూటీ డీఎంహెచ్‌వోపై ఉంది. సమాచారంలో 6
 6. ఏమైనా లోపాలు, అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 7. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను చేయించుకుంటే మగ శిశువుకు రూ. 12 వేలు, ఆడశిశువుకు 13 వేలనగదును పలు దఫాలుగా ఇవ్వాలని నిర్ణయించారు.
 8. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం రెండు సార్లు పరీక్షలు చేయించు కుంటే మొదటిదఫా రూ.3 వేలను బ్యాంకు ఖాతా లో వేస్తారు. అదే ఆస్పత్రిలో
 9. ప్రసవిస్తే ఆడబిడ్డకు రూ.5 వేలు, మగశిశువుకు రూ.4 వేల ఖాతాలో జమ చేస్తారు.
 10. బిడ్డకు మూడు నెలల కాలంలో టీకాలు వేయించిన తరువాత రూ.2 వేల ఇస్తారు.
 11. బిడ్డ 9 నెలల కాలంలో ఇప్పించాల్సిన టీకాలను తీసుకున్న తరువాత రూ.3 వేలు ఖాతాలో వేస్తారు
 12. కేసీఆర్‌ కిట్‌లో ఉండే వస్తువులు
  బేబి బెడ్‌, దోమతెర (రూ.350), బేబి మాకింతోష్‌ (రూ.90), డ్రస్సులు -2 (రూ.200), టవల్స్‌ -2 (రూ.100),నప్పి(6) (రూ. 100), పౌడర్‌ (200గ్రా.రూ.120), షాంపూ(100గ్రా రూ.85), బేబి అయిల్‌ (200ఎంఎల్‌ రూ.200), బేబి సబ్బులు-2 (రూ.90), బేబి బస్సు బాక్సు (రూ.25, బేబి ఆట వస్తువు (రూ.50), మథర్‌ బస్సు (రూ.40), చీరలు-2 (రూ.350), కిట్‌ బ్యాగు (రూ.150), ప్లాస్టిక్‌ బాస్కెట్‌ (రూ.50).