జియోకి పోటిగా ఎయిర్ టెల్ .. – Dharuvu
Breaking News
Home / SLIDER / జియోకి పోటిగా ఎయిర్ టెల్ ..

జియోకి పోటిగా ఎయిర్ టెల్ ..

మొబైల్ డేటా రంగంలోకి రిలయన్స్‌ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తోంది. ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది.

360రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కింద 300జీబీ 4జీ డేటా అపరిమిత ఉచిత వాయిస్‌కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.3,999తో రీఛార్జ్‌ చేసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.ఈ ప్లాన్‌ ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.334 చెల్లించినట్లవుతుంది. డేటా విభజిస్తే నెలకు 25జీబీ 4జీ డేటా, అపరిమితకాల్స్‌ పొందవచ్చు.