‘షాక్ థెరపీ’ పేరుతో సీక్రెట్‌ కెమెరా శృంగార వీడియోలు హల్ చల్ – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / ‘షాక్ థెరపీ’ పేరుతో సీక్రెట్‌ కెమెరా శృంగార వీడియోలు హల్ చల్

‘షాక్ థెరపీ’ పేరుతో సీక్రెట్‌ కెమెరా శృంగార వీడియోలు హల్ చల్

స్మార్ట్‌ఫోన్‌తో యావత్‌ ప్రపంచాన్నీ అందుబాటులోకి తెచ్చుకున్నామని ఒకవైపు మనం సంబర పడుతుంటే.. దాని దుష్ప్రభావాలూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ప్రతి ఏడాది వేల కొద్ది లైంగిక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాల కోసం ఆన్‌లైన్‌లో వెతికేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ కొరియా పోలీసులు ఊహించని షాక్‌ ఇస్తున్నారు.

దక్షిణ కొరియా పోలీసులు ‘షాక్ థెరపీ’ పేరుతో సీక్రెట్‌ కెమెరా శృంగార వీడియోలను తయారు చేసింది. వీటిని ఫైల్‌ షేరింగ్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. వీటిని పోర్న్‌ వీడియోలుగా భావించి గత నెల 17 నుంచి 31లోపు దాదాపు 30 వేల మంది ఓ వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకున్నారట. ‘ ఆమె ఆత్యహత్య చేసుకోవడానికి మీరు కారణం కావొచ్చు’ లాంటి హెచ్చరికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ షాక్ థెరపీతో పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీక్రెట్‌ కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు దొరికితే అయిదేళ్ల జైలు శిక్ష ఖాయం అంటున్నారు.