హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకు గుడ్ న్యూస్ – Dharuvu
Breaking News
Home / BUSINESS / హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకు గుడ్ న్యూస్

హెచ్‌డిఎఫ్‌సి ఖాతాదారులకు గుడ్ న్యూస్

సేవింగ్స్, సాలరీ ఖాతాలు కలిగిన ఖాతాదారుల కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఒక తీపి కబురును వెల్లడించింది. ఖాతాదారులు ఇకపై ఆర్టీజీఎస్‌,ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చేసే ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఈ సేవలను నవంబర్ 1 నుండి ఇకపై ఈ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు. ఇంతకు ముందు ఆర్టీజీఎస్‌ ద్వారా రూ.2-5 లక్షల మధ్య చేసే లావాదేవీలకు రూ.25, రూ.5లక్షల పైబడి మొత్తంపై రూ.50 చొప్పున రుసుముగా వసూలు చేసేవారు. అలాగే, ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా రూ.10వేలు లోపు లావాదేవీలపై రూ.2.5, రూ.10వేలు నుంచి రూ.లక్ష మధ్య రూ.5, రూ.1-2 లక్షల మధ్య రూ. 15, రూ.2లక్షలకు పైబడి మొత్తాలపై రూ.25 చొప్పున రుసుముగా వసూలు చేసేవారు.ఒకవేళ ఇవే తరహా లావాదేవీలను బ్యాంక్‌ శాఖలో జరిపితే మాత్రం రుసుము వసూలు చేస్తారు.

ఇప్పటి వరకు 25 పత్రాలు ఉన్న చెక్‌బుక్‌లను ఏడాదికి రెండు ఇచ్చేవారు. ఇకపై చెక్‌బుక్ మాత్రం ఒకటే వుంటుందట. రెండో చెక్‌బుక్‌ కావాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాలో తగిన మొత్తం లేక వెనక్కి వచ్చే చెక్కులపై రూ.500 ఫెనాల్టీగా వసూలు చేయనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.