Home / LIFE STYLE / పెరుగు తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకోండి..!

పెరుగు తినడం వల్ల పొందే ప్రయోజనాలు తెలుసుకోండి..!

చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. రోజూ పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని “పెరుగు” అంటాం. ఆంగ్లంలో “యోగర్ట్” అనీ హిందీలో “దహీ” అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు.

విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తారు. పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి.

పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

1: ఆవు పాలతో పోల్చినప్పుడు గేద పాలలో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అందుకే గేద పాలతో తయారుచేసిన పెరుగును తినడం వల్ల జీర్ణం కాలేదని చాలా మంది అంటుంటారు. ముఖ్యంగా వయస్సైనవారు. అందువల్ల, ఆయుర్వేదం గేద పాలతో తయారుచేసిన పెరుగు కంటే ఆవు పాలతో తయారుచేసిన పెరుగును తినమని సూచిస్తోంది.

2: తాజా పెరుగు మాత్రమే తినాలి?
పెరుగును కొన్ని రోజుల నిల్వ చేసి తర్వాత తినడం అంత మంచిది కాదు, అలాంటి పెరుగులో మంచి బ్యాక్టీరియా నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి, పెరుగు తినాలనుకుంటే, పెరుగు పేరబెట్టిన తర్వాత 24 గంటలలోపు తినేసేయాలి.

3:ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ తో బాదపడే వారు డయోరియా, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి, మంచి క్వాలిటీ ఉన్న పాలను మరియు పెరుగును తీసుకోవడం మంచిది, ఇది పొట్టలో యాసిడ్స్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తుంది. జీర్ణశక్తికి అవసరం అయ్యే ప్రోటీన్స్ ను అందిస్తుంది. దాంతో జీర్ణం అవుతుంది.

4: రోజూ పెరుగు తినడం వల్ల వ్యాధినిరోధకత పెరుగుతుంది.

5: ఆకలి తగ్గిస్తుంది. రెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం వల్ల ఇతర ఆహారాల మీద కోరికలు కలగకుండా, ఆకలి కానివ్వకుండా…అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది . పెరుగు తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది .

6: సెక్స్ సామర్థ్యంను పెంచడంలో పెరుగు ఒక న్యాచురల్ పదార్థం, వాస్తవానికి వంద్యత్వాన్ని తగ్గిస్తుంది. పురుషుల్లో వీర్యం యొక్క నాణ్యత పెంచుతుంది. వీర్యం ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడుతుంది.

7: రోజూ పెరుగు తినడం వల్ల చౌకగా, సురక్షితంగా బ్యూటీని మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, మరియు ఇతర మైక్రో మినిరల్స్ అధికంగా ఉండి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను మచ్చలను తొలగిస్తాయి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి.

8: సన్ బర్న్ నివారిస్తుంది. సన్ బర్న్ నివారించడంలో కలబందకు మించిన రెమెడీ లేదు. అలాంటిది అయితే అది వెంటనే, ఎప్పుడూ అందుబాటులో ఉండదు. అయితే అదే సామర్థ్యం కలిగిన పెరుగు, చౌకగా మరియు సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీకి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్, నొప్పి తగ్గించి, చర్మానికి కూల్ నెస్ ను అందిస్తుంది.

9: రోజూ పెరుగు తింటుంటే హార్ట్ సమస్యలుండవు పెరుగులో ఎలాంటి ఫ్యాట్ లేకపోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, దాంతో ధమనుల్లో పాచ్చి గడ్డకట్టకుండా సహాయపడుతుంది.

10: ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది, అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్ లో పెరుగుచేర్చుకోవడం కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది . దాంతో ఫ్యాట్ విచ్ఛిన్నం చేసి, బ్లీ ఫ్యాట్ కరుగుతుందిజ అలాగే ఆకలి తగ్గించి, జీవక్రియలను చురుగ్గా మార్చుతుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat