Home / BUSINESS / కేవలం రూ.179తో అన్ లిమిటెడ్ కాల్స్‌… ఎన్ని రోజులు తెలుసా..?

కేవలం రూ.179తో అన్ లిమిటెడ్ కాల్స్‌… ఎన్ని రోజులు తెలుసా..?

జియో పోటీని తట్టుకునేందుకు ఐడియా సెల్యులర్‌ మరో కొత్త ఆఫర్‌తో వినియోగదారులకు ముందుకు వచ్చింది. కేవలం రూ.179తో రీఛార్జి చేసుకుంటే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 1జీబీ డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా నిర్వాహకులు వెల్లడించారు. ఐడియా వినియోగదారులు మైఐడియా యాప్‌ నుంచి రీఛార్జి చేసుకుంటే అదనంగా మరో 1జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. వాయిస్‌ కాల్స్‌ను ఎక్కువగా చేసుకునే ప్రీపెయిడ్‌ చందాదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఐడియా సెల్యులర్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శశి శంకర్‌ తెలిపారు.
అంతకముందు ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం ఐడియా రూ.357 ఆఫర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 28రోజుల కాలపరిమితితో రోజుకు 1జీబీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది. వొడాఫోన్‌ రూ.177 ఆఫర్‌ను తీసుకొచ్చిన వారం వ్యవధిలోనే ఐడియా రూ.179 ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat