Home / ANDHRAPRADESH / రెండో రోజు వరాల జల్లు కురిపించిన జగన్ ..

రెండో రోజు వరాల జల్లు కురిపించిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండోరోజు వైఎస్సార్ కడప జిల్లాలోని వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు… ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు .

గతంలో బాబు ఇచ్చిన మేనిపెస్టొ మాదిరిగా తమ పార్టీ మేనిఫెస్టో మాత్రం అలా ఉండదు. రెండే రెండు పేజీలుంటుంది. అందులో చెప్పినవన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తాం. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. మీ సలహాలు స్వీకరించి మరింత మెరుగ్గా చేస్తాం. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం అని అన్నారు .అంతే కాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం అవ్వా, తాతలకు ఇస్తున్న రూ.1000 పెన్షన్‌..మేం అధికారంలోకి రాగానే రూ.2.వేలు చేస్తాం.

ఒకవేళ చంద్రబాబు రూ.2వేల పెన్షన్‌ ఇస్తే… నేను రూ.3వేలు చేస్తా. అలాగే ఎవరూ లేని ఒంటరి వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి మండలంలో ఒక వృద్దాశ్రమయం ఏర్పాటు చేస్తా. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటా. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా కాలేజీ విద్యార్థులకు ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి యువతకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat