మగవారు గర్భం దాల్చవచ్చు…! ఇదిగో – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / మగవారు గర్భం దాల్చవచ్చు…! ఇదిగో

మగవారు గర్భం దాల్చవచ్చు…! ఇదిగో

మహిళలతో సమానంగా మగాళ్లు కూడా గర్భం దాల్చవచ్చా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, అమెరికాకు చెందిన సంతానోత్పత్తి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. పిల్లల్ని కనడం కోసం మహిళలకు ప్రత్యేకంగా అవయవ నిర్మాణం ఉంటుంది. అయితే, పురుషులు కూడా లింగ మార్పిడి తరహాలో.. గర్భాసయ మార్పిడి ప్రక్రియ ద్వారా పిల్లలను కనవచ్చని అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రీప్రొడక్టివ్‌ మెడిసిన్‌ అధ్యక్షుడు రిచర్డ్‌ పాల్సన్‌ ధీమాగా చెబుతున్నారు. లింగమార్పిడి ప్రక్రియతో స్త్రీలుగా మారిన పురుషులు.. గర్భం దాల్చేందుకు అనువుగా అవయవ మార్పులు చేపడుతున్నారు.

లింగ మార్పిడి తర్వాత పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని పాల్సన్ తెలిపారు. పురుషులు, మహిళల మధ్య పొత్తి కడుపు నిర్మాణంలో వ్యత్యాసం ఉంటుందన్నారు. పురుషుల్లో కడుపు నిర్మాణం మాత్రం భిన్నంగా ఉంటుందని, వారు గర్భం దాల్చినట్లయితే సిజేరియన్ తప్పనిసరి అని అన్నారు.

‘‘గర్భంలో పిండం ఎదుగుదలకు స్త్రీలలో హార్మోన్లు సహజంగానే విడుదలవుతాయి. పురుషులకు మాత్రమే ఆ అవకాశం లేదు. ఇందుకు ప్రత్యేకంగా హర్మోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి’’ అని తెలిపారు. పురుషులు సైతం మహిళల్లా గర్భం దాల్చి పండండి బిడ్డకు జన్మనిచ్చే రోజులు మరెంతో దూరంలో లేవని ఆయన స్పష్టం చేశారు.
మగాళ్లు గర్భం దాల్చవచ్చని.. అరిజోనాకు చెందిన థామస్ బీటై ఇప్పటికే నిరూపించాడు. ఆయన అధికారికంగా లింగ మార్పిడి శాస్త్రచికిత్స జరిపించుకుని, గర్భం దాల్చాడు. ప్రపంచంలో తొలిసారి గర్భం దాల్చిన పురుషుడిగా రికార్డులకెక్కాడు. అయితే, ఈ సారి లింగ మార్పిడి అవసరం లేకుండానే గర్భాశయ మార్పిడితో పురుషులు గర్భం దాల్చవచ్చని పాల్సన్‌ చెబుతున్నారు.