నమ్మిన మనిషే మోసం చేశాడు .ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదు – Dharuvu
Breaking News
Home / CRIME / నమ్మిన మనిషే మోసం చేశాడు .ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదు

నమ్మిన మనిషే మోసం చేశాడు .ఎవర్ని నమ్మాలో అర్ధం కావడంలేదు

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఇటీవల 2 లక్షల రూపాయల చోరీ జరిగిందని, ఆయన మేనేజర్ గంగాధర్ పోలీసులకు కంప్లయింట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మెగాస్టార్ ఇంట్లో పనిచేసే చెన్నయ్యే ఈ పని చేశాడని తెలుసుకున్న హైదరాబాద్ మహానగర పోలీసులు వెంటనే అతనని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతని వద్ద నుండి 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, మరో 50 వేలు అతను జల్సాలకు ఖర్చు పెట్టాడని ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ విషయంపై తాజాగా చిరంజీవి స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయన మాట్లాడుతూ చెన్నయ్య ఇలా చేశాడని తెలిసిన తర్వాత నమ్మకం మీదే నమ్మకం పోయిందని ఆయన స్పందించినట్లుగా టాక్. ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉండేవాడని, కుటుంబ సభ్యుల్లో ఒకడిగా కలిపిపోయిన చెన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోయానని, సొంత మనిషిలా చూసుకున్నామని చిరంజీవి అన్నట్లుగా చెబుతున్నారు. చెన్నయ్య చేసిన ఈ పనితో అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అంతలా అతనని నమ్మితే, ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని ఆయన అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.