సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్ – Dharuvu
Breaking News
Home / CRIME / సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్

సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి దారుణ హత్య… వాట్సాప్‌లో వైరల్

 సింగపూర్‌లో హైదరాబాద్‌ వ్యాపారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన వాసుదేవ్‌రాజ్‌ను వ్యాపారం పేరుతో పలువురు సింగపూర్‌కు తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లాక అతన్ని గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజ్‌ బంధువులకు నిందితులు ఫోన్‌ చేసి రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారు. డబ్బులు చెల్లిస్తే అతన్ని వదిలేస్తామని బెదిరించారు. వాసుదేవ్‌ను బంధించిన చిత్రాలను వాట్సాప్‌లో పంపించారు. బంధువుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అతన్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం భారత రాయబార కార్యాలయం ద్వారా బంధువులకు చేరింది. రేపు లేదా ఎల్లుండి వాసుదేవ్‌ మృతదేహం నగరానికి చేరుకోనుంది.