అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్ – Dharuvu
Breaking News
Home / CRIME / అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్

అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అవుతన్న 19 ఏళ్ల ఓ యువతిని నలుగురు వ్యక్తులు భోపాల్‌ ల్లో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం మరవక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ పేర్కొన్న వివరాల ప్రకారం.. అక్టోబర్ 30న సాయంత్రం బాగా పొద్దుపోయిన తర్వాత ఆమె ఇంటికి తిరిగెళ్లడానికి వేచి చూస్తుండగా.. కారులో వచ్చిన ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానంటూ వాహనంలోకి ఎక్కించుకున్నాడు.

కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కారు. అనంతరం ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు మహిళ తెలిపింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.